Saturday, July 10, 2010

జగన్నాథ రథయాత్ర , Jagannadha Radhayatra





భారతదేశము ఒక పెద్ద పుణ్య క్షేతము . ఎక్కడచూసినా గుడులు , గోపురాలు , మసీదులు , చర్చ్ లు ఉంటాయి. ఆద్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది . ఏ దేశములో లేని ఎక్కువమంది దేవుళ్లూ , దేవతలూ , బాబాలు , ఋషులు , ఇక్కడే ఉన్నారు . ప్రజలను మంచి మార్గము లో జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మన పూర్వీకులు పెట్టిన నియమ నిబంధనలే ఈ ఆద్యాత్మిక పూజా విధానాలు . దేవుడు ఉన్నాడా ?... లేడా? ... అనే విషయము ప్రక్కనపెడితే మానసిక శక్తిని పొందేందుకు భగవత్ స్మరణ ఒక మంచి మార్గము . దీనినే వైద్యవిధానము లో యోగా అని అనవచ్చు . మనసుని అధుపులో ఉంచగలిగితే మన శరీరాన్ని అదుపులో ఉంచగలుగుతాము . (Mind controls the body ).. ఎన్నో మానసిక రుగ్మతలకు దూరము గా ఉండవచ్చును . మనకు వచ్చే రోగాలలో 80 శాతము మానసికమైనవే . భగవత్ నమ్మకము విశిస్టమైనది ... నమ్మకము ఎప్పుడూ మూఢనమ్మకము కాకూడదు .

మన దేశము లో నాలుగు దిక్కులా ్వున్నా పవిత్ర పుణ్యక్షేతాలను ' చార్ ధామ్‌' గా పిలుస్తారు .
  • ఉత్తరాన - బదరీ,
  • దక్షినాన - రామేశ్వరము ,
  • పడమరన - ద్వారక ,
  • తూర్పున - పూరీ క్షేత్రాలు ఉన్నాయి .

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో ( ఆషాడ శుద్ద విదియ నుండి )నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

for full details about Puri Jagannadha temple -> పూరీ జగన్నాథ దేవాలయం
  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: