![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi9TckUa11-IWPyJh3MqkFpsYIWRse-aSO8404Op-FUk7-yVkqc6mG1xu7hjtEeht-f4h2Ay4NHENunMG5UNPu1ENiau-S9UvMIB14blGUbAQHwtEClnxarG4nBy8Kyxb2iX70jkSCO7gzX/s400/Namaj.jpg)
మనిషి జీవన నడవడికకు సంబంధించి అల్లా నుండి వెలువడిన 14 మార్గదర్శక సూత్రాల సమహార సందర్భాన్ని " షబేమెరాజ్ " గా పిలుస్తారు అని ఇస్లాం మతపెద్దలు పేర్కొంటున్నారు . అల్లా పెలుపు మేరకు ఆఖరి దైవప్రవక్త ' సల్లాల్లాహు అలైహివసల్లం ' సప్తఅకాశాల పైన వేంచెసిన సృస్టికర్త సన్నిధికి ఆరోహణ చేసిన రాత్రినే ' షబేమెరాజ్ ' గా పెర్కొంటున్నారు . దైవదూత ' హజరత్ జిబ్రెల్ అలైహివ నసల్లాం ' వెంటరాగా ఆఖరి దైవప్రవక్త ఆకాసం వైపుకు నిచ్చెన (మెరాజ్) సహాయము తో దైవసన్నిధికి ప్రయాణించారని వివరించారు . సల్లాలాహు , అలైహివ సల్లాం కు అల్లాతో ప్రత్యక్షము గా మాట్లాడే అవకాసము కలిగిందని , ఈ సందర్భముగా అల్లా మానవ జీవితానికి సంభందించిన 14 మార్గదర్శక సూత్రాలను వారికి ఉపదేశించారని నమ్మకము . ఈ ఉపదేశాలకు సంభందించిన ప్రస్తావన పవిత్ర గ్రంధం ఖురాన్ లో ' బనీ ఇస్రాయిల్ ' అనే అధ్యాయము లో పొందుపరిచారని పేర్కొనారు .
ఈ రోజు ముస్లిం సోదరులందరూ మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు చేయుదురు . నమాజ్ , ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు .
- ==================================
No comments:
Post a Comment