![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVkU6H9AyYsxUpI28FLPgv20gTHibg1GMZwFNeIqTnfhegOxZqe0QP7xg5RrtF_UeoUuoXfJbbr9RVWIqVxWdk-jEx_p9ZNiNQLAEtU_sSlmmCooN-9EsA5WNuQnFVc3TIZh5IH8kGP4Ji/s320/Potti+Sriramulu.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3huD3dR_6PneqvLZvg1VLiZXrihPPeM5zecPz0O0Rz5nZdyoWW7KnEgW7cp77WLmCDFmoSx0005BxldymV7B9DfLniYBSn2-BYkKvmbgbC8AUwkh7ntvjoM9NGiWtDAcMPshFAy42SIHC/s320/ap+map.gif)
బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.
మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.
శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – విశాలాంధ్ర - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
మిగతా వివరాలకు వికీపీడియా చూడండి - > ఆంధ్ర రాష్ట్ర అవతరణ
1 comment:
Have you played [url=http://mastercardcasinos.biz.tc]MasterCard casinos[/url]? Can I trust it?
Post a Comment