Wednesday, July 17, 2013

Birth of river Ganga,గంగావతరణం

  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Birth of river Ganga,గంగావతరణం -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

 నదులు పుట్టుక ప్రకృతి పై ఆధారపడి వర్షాధారముగానో , మంచు కొండలలోని మంచు కరగడము వలనో చిన్న పాయలు , వాగులు , సెలయేళ్ళు కలయిక వలన పల్లపు ప్రంతాలకు ప్రవహించడము వలన యేర్పడుతూ ఉంటాయి.  ఇది ప్రకృతి సహజము . కాని మన హిందూ పురాణాలలో వ్యాసమహర్షి  రచనలవలన అంతా దైవకృపవలనే జరిగినట్టుగా వ్రాయబడినది . కదో , నిజమో చరిత్ర కారులకే తెలుస్తుంది . ప్రస్తుతానికి ఇది ఒక పురాణ కధగానే చెప్పుకుంటున్నాము .

"గంగాధరా హర హర నమో" అని శివుణ్ణి ప్రార్ధిస్తాము . గంగను ధరించిన ఓ శివా నీకు నమష్కారము అని అంటాం. మరి ఆ గంగాదేవి ఎప్పుడు అవతరించినట్లూ , అంటే అందుకో పౌరాణిక కధ ఉంది. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే ... ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి -- గంగా సప్తమి .

కధ :
ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు . సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సాగరరాజు  అశ్వమేథ యాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి, కుయుక్తితో దానిని కపిల మాహర్షి దగ్గర కట్టి వేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువ రాజులు కపిలుడే దానిని బంధించాడని భావించి, ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులందరినీ భస్మంగా మారుస్తాడు.

సాగర చక్రవర్తి రెండవ భార్య కుమారుడు అసమంజ. అతని కుమారుడైన అంసుమాన్‌ తమ తప్పును క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన రుషి దేవలోకం నుండి గంగను భూమి మీదకు తేగలిగితే, రాకుమారుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.

దివినుంచి భూమికి గంగను తీసుకురావడానికి ఆ రాకుమారుడు చేసిన ప్రయత్నం విఫలం అయింది. దాంతో అతని మనుమడయిన భగీరధుడు కఠోర తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి గంగను భూమి మీదకు పంపవలసిందిగా ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ కరుణించి గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని, ఆ శక్తి ఒక్క శివునికే ఉందని చెప్పాడు. దాంతో భగీరధుడు శివుని గూర్చి ఘోరతపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై అతని కోర్కెను తీర్చడానికి అంగీకరించడమే కాక, గంగను తన తలమీదనే ఉంచుకుంటానని చెప్పాడు. అయితే, గంగ అహంకారంతో శివుడి తలనే వంచానని విర్రవీగింది. గంగ అహాన్ని గమనించిన శివుడు ఆమెను ఏకంగా తన జటాజూటంలో బంధించాడు. మార్గంతరం లేని భగీరధుడు మరలా తపమాచరించి గంగను క్షమించి, భూమిపైకి పంపమని శివ మహారాజును కోరగా, అందుకు ఆయన అంగీకరించి గంగను భూమిమీదకు పంపాడు. భగీరధుడు గంగా ప్రవాహాన్ని ఎంతగా క్రమబద్ధం చేస్తున్న ప్పటికీ, అత్యుత్సాహంతో గంగ మహర్షి జాహ్నవి హోమాన్ని చిందరవందర చేసింది. దానికి ఆగ్రహించిన ఆయన గంగను ఔపాసన పట్టడంతో భగీరధుని సమస్య మరలా మొదటి కొచ్చింది. పట్టువీడని భగీరధుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. అందుకు జాహ్నవి అంగీకరించి ఆమెను తన చెవినుండి విడవడంతో తన పూర్వీకుల భస్మాలపై గంగను ప్రవహింపజేసి, వారికి ముక్తి కలిగించాడు.జాహ్నచి ముని చెవినుండి జన్మించినది కావున గంగను " జాహ్నవి" అని పేరు వచ్చింది. " భగీరదుడు జన్మించాడు .

  • ====================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.