Thursday, June 13, 2013

Guru ArjanDev,గురు అర్జున్‌ దేవ్‌

  •  















  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -Guru ArjanDev,గురు అర్జున్‌ దేవ్‌- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --



సిక్కుల ఐదో గురువు గురు అర్జున్‌ దేవ్‌ వర్ధంతి(June 10th) సందర్భంగా సిక్కు మతస్థులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్రీ.శ. 1606లో ఆయన బలిదానం చేశారు. సిక్కుపంత్‌ పరిరక్షణకు జీవితకాలం కృషి చేశారు. ఆయన అమరుడైన రోజును పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో సిక్కులు ప్రార్థనలు చేశారు. సిక్కుల ఐదవ మత గురువు అర్జున్ దేవ్ 402వ వర్ధంతిని సిక్కులు సోమవారం(10-06-2013) దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అమృత్‌సర్ సమీపంలోని తరన్ తరన్‌లోని గురుద్వారాను వేలాది మంది భక్తులు సోమవారం సందర్శించారు. గురు అర్జున్ దేవ్ పరమత సహనాన్ని పాటించి అన్ని మతాలకు చేరువయ్యారు.

సిక్కుల నాల్గవ మత గురువు రాం దాస్ చిన్న కుమారుడు అర్జున్ దేవ్ 1563లో పంజాబ్‌లోని గోండివాల్‌లో జన్మించారు. సిక్కుల పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో హర్‌మందిర్ సాహెబ్‌ను అర్జున్ దేవ్ నిర్మించారు. పంజాబ్‌లో ప్రముఖ ప్రాంతాలైన అమతృ్‌సర్, కర్తార్‌పూర్‌లను బాగా అభివృద్ధి చేయటమే కాకుండా, తరన్ తరన్ పట్టణాన్ని నిర్మించారు.

సిక్కుల పవిత్ర గ్రంధమైన ఆది గ్రంథ్‌ను అర్జున్ దేవ్ రచించారు. గురు గ్రంథ్ సాహెబ్‌తో సమానమైనదిగా పరిగణిస్తారు సిక్కులు ఆది గ్రంథ్‌ని. హిందూ, ముస్లిం మత ప్రచారకుల రచనలు ఆది గ్రంథ్‌లో ఉన్నాయి. గురు అర్జున్ దేవ్‌‌ను ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయనను ఉరి తీయించారు.

  • =========================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.