అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -త్రిశంకు స్వప్నం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --
ఒకవైపు ఆధ్యాత్మికలోకాల పిలుపులు, మరోవైపు జీవన మాధుర్యాల తలపులు. అటు దైవం, ఇటు జీవితం. సత్య ,శివ, సౌందర్యాలు దూరతీరాలనుంచి రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. మమ్మల్ని వదలేస్తావా అని నిత్య భవబాంధవ్యాలు కలవరిస్తుంటాయి.
ఈ జీవితం స్వర్గ, వాస్తవాల మధ్య వేళ్లాడే త్రిశంకు స్వప్నం. జీవితాన్ని వదులుకోలేం . ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రయాణించకుండా ఉండలేం. ఇది చాలామంది పరిస్థితి. యథార్థ స్థితి. చివరికి రెంటికీ చెడిన రేవడులా మారిన స్థితి. నైరాశ్యం, అసంతృప్తి, ఏదో కోల్పోతున్నామన్న పరివేదన, నిరాసక్తత, నిస్సహాయత, నిర్వీర్యత, నిర్లిప్తత- ఇదీ జీవితం! ఇదా జీవితం, ఇదేనా?
జీవితంలోనే ఉండి భగవంతుణ్ని సాక్షాత్కరింపజేసుకోలేమా? అలా దైవాన్ని పొందగలిగిన భక్తులు గతంలో లేరా? అది అసంభవమా, అలా చేయడం తప్పా? సర్వ మానవాళిలో దివ్య సౌందర్య మహత్వాన్ని వీక్షించి, ప్రేమించి, ఆనందాన్ని పొందితే అంతకుమించిన భగవత్ సాక్షాత్కార దర్శనం ఉంటుందా?
'నీలో దైవాన్ని దర్శించు, నీ పొరుగువాడిలో దైవాన్ని తిలకించు. దేశంలో దైవాన్ని వీక్షించు. మానవాళిలో దైవత్వాన్ని చూడు. చెట్టులో, రాయిలో, మృగంలో, ప్రపంచంలోపలా, వెలుపలా దైవాన్ని చూడటం నేర్చుకో'- అన్న తత్వవేత్తల ప్రవచనసారం తెలుసుకుంటే చాలు, జీవితం ధన్యమవుతుంది, సార్థకత చెందుతుంది. పూర్ణత పొందుతుంది.
భూమి పై పుట్టిన ప్రతి జీవి ఆనందాన్ని అనుభవించాలి. ప్రకృతి సోయగాల్ని , ఫలాల్ని అనుభవించాలి. పుట్టిన ప్రతిజీవి చనిపోక తప్పదు. భగవంతుడు ఉన్నాడో ... లేడో తెలియదు , తెలుసుకోలేము, అది ఒక నమ్మకము మాత్రమే. దైవము , భక్తి , ముక్తి అని కాలాన్ని వృధాచేయకు. ఏ వయసు కు ఆ ముచ్చట అన్నట్లు జీవితాన్ని అనుభవించు. ఈ విశ్వములో అనేకానేక జీవులలో ఒక జీవి ఇంకోజీవిని తింటూ బ్రతుకుతుంది. ప్రతి పదార్ధము లోనూ జీవము ఉంది. కొన్ని చలనము లేనివి , కొన్ని చలనము ఉన్నవి . చలనమున్న మనిషి చలనము లేనివాటిని జీవములేనివాటిగా భావిస్తాడు ...ఎందుకు ?... తను చలనమున్నవాడు కాబట్టి . అలా ఈ జీనన చక్రము అంతము లేకుండా గమనం చేస్తూనే ఉంటుంది. సోమరి పోతుగా నీ విలువైన కాలాన్ని వృధా చేయకు. నిరంతరము నీ విధిని (పనిని) తోటి జీవులకు హాని కలుగకుండా చేస్తూఉండు .
- ===================
No comments:
Post a Comment
Your comment is helpful in improvement of this Blog.