వరదరాజ స్వామి---
వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది. స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి
నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.
ఒక సందర్భంలో భగవద్రామానుజులని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరద రాజ స్వామే మారు వేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు.
ఈ వరదరాజ స్వామి యజ్ఞగుండంలో ఉద్భవించాడు కాబట్టి ఆయనకు తాపం ఎక్కువట. అందుకే వరదరాజ స్వామి ప్రియ భక్తుడైన తిరుకచ్చినంబి ఆయనకు వింజామర సేవ ప్రారంభించారు.(తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో ముఖాముఖి మాటలాడగల మహా భక్తుడు. భగవద్రామానుజులు ’వార్తా షట్కము’ అనే ఆరు ప్రశ్నలకు సమాధానం ఈయన ద్వారానే వరదరాజ స్వామి ని అడిగి తెలుసుకున్నారు.) --- ప్రచురించిన వారు భాను వర్గములు .
వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి.ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు.తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి. పరివార దేవతలు వేంకటేశ్వరుని చరిత్ర సంబంధం ఉన్నవారే కావడం విశేషం. పరివార దేవతలకు లోపలే ఆలయాలు కట్టించడంలో ఎందరో రాజులు, ఆల్వార్లు, రామానుజాచార్యలాంటి వారు విశేష కృషి చేశారు. ఆగమశాస్త్ర అనుసారం ఈ దేవతలు అన్నిరకాల పూజలు అందుకుంటున్నారు. వారిలో మొదటి దేవుడు వరదరాజస్వామి.తిరుమలలో వెంకన్న ఉండడానికి కాస్తం చోటు ఇచ్చిన స్థలదాత వరదరాజ స్వామి. ఆ తరువాత వెంకన్నే సకల జగత్తును తన వశం చేసుకున్నాడు. చోటిచ్చేందుకు వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందట. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు ముందుగా వరదరాజస్వామి దర్శనం చేసున్న తరువాతే తన దర్శనానికి వస్తారని వెంకన్న మాట కూడా ఇచ్చాడు.ఇందుకు అనుగుణంగానే నిన్నమొన్నటి దాకా పుష్కరిణికి పక్కనున్న వరదరాజ స్వామి దర్శనం తరువాతే క్యూ వెంకన్న గుడిలోకి వెళ్లేది. ప్రస్తుతం ఆ ఆనవాయితీ కాలగర్భంలో కలసి పోయింది. తెలిసిన వారు మినహా మిగిలిన వారందరూ నేరుగా వెంకన్న దర్శనానికే వెళుతున్నారు. లోపలి భాగంలో కూడా వరద రాజస్వామి ఆలయం ఉంది. అక్కడ వరద రాజస్వామి కూడా పూజలు అందుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం తై అమావాస్య రోజు శ్రీకాళహస్తిలో వరదరాజ స్వామికి తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. తమిళ కాలెండరులో తై మాసం జనవరి మధ్య నుండి మొదలయ్యి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ తై మాసంలో వచ్చే అమావాస్య రోజు మన పూర్వీకులని గుర్తు చేసుకుని ప్రార్ధించటం ఈరోజు ప్రత్యేకత. శ్రీకాళహస్తిలో శివుడు గుడి మాత్రమే కాకుండా వరదరాజ స్వామి గుడి కూడా ఉంటుంది. తై అమావాస్య రోజు పూసల వీధిలోని వైష్ణవ పుష్కరణి (కోనేరు) లో శ్రీదేవి, భూదేవితో కలిపి తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తారు. సాయంత్రం వరకు గుడిలో పూజలు జరిపిన తర్వాత ఎనిమిది గంటలపైన శ్రీకాళహస్తి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెప్పోత్సవం మొదలయింది. కోనేరుకి నాలుగు వైపుల భక్తులు కూర్చుని వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ప్రదక్షిణ తర్వాత కాసేపు బాణసంచా కార్యక్రమం పిల్లల్ని అలరించింది.
వరదుడికి వైభవంగా గరుడసేవ -- కాణిపాక వరసిద్ధి ఆలయానికి అనుబంధంగా ఉండే వరదరాజ స్వామి ఆలయంలో శనివారం రాత్రి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి, పెరిందేవి సమేత వరదరాజ స్వామికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కల్యాణం చేసి, రాత్రి గరుడసేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంను కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కుడా వుంది.
తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు. దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు. ముఖ్యంగా చోళులు. శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం, వెలకట్ట లేనిది. ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం. అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి. అలాంటి ఎన్నో కోవెలలో ఒకటి నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం. నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో.
చిత్తూరు--పార్వేట వరదరాజ స్వామి . ఛిత్తూరు జిల్లా పాకాల మండలం లో వల్లివేడు గ్రామలో పురాతన వరదరాజ స్వామి ఆలయం కలదు. ప్రతి ఏడు సంక్రాంతి సందర్బంగా చివరి రోజున అనగా కనుమ పండగ రోజున, వరదరాజ స్వామి వారిని పల్లికిలో ఆ చుట్టు పక్కల పల్లెల్లో వూరేగించి చివరగా కూనపల్లి వద్ద ఉన్న చిన్న గుడి వద్ద శమీ వృక్షం వద్ద పూజ చేస్తారు. అక్కడే అప్పుడు ఈ కార్యక్రమం కొరకు వుంచిన ఒక పొట్టేలుకు కూడ పూజ చేస్తారు. దాన్ని ఆ పక్కనే ఉన్న మల్లేశ్వర స్వామి కొండ వాలులో దూరంగా కట్టివుంచు తారు. కింద చేలల్లో దూరంగా అందరూ నిలబడి ఒక్కొక్కరుగా తుపాకులతో గురి పెట్టి పొట్టేలును కాల్చడానికి ప్రయత్నిస్తారు. అది అంత సులబం కాదు. పొట్టేలు చాల దూరంలో వుంటుంది. అంతే గాక, స్వామి వారి పల్లికి వెంబడి మంగళ వాయుద్యాలు వాయించిన ఆలయ ఆస్తాన మంగలివారు, జమ్మిచెట్టు కింద ఆ పొట్టేలుకు తుపాకి దెబ్బ తగలకూడదని పూజ చేస్తుంటారు. సూర్యాస్థమ సమయానికి దాన్ని ఎవరూ కాల్చక పోతే అది ఆ మంగలి వారికి చెందుతుంది. అందుకే వారు పూజ చేసేది. అలా చాల మంది ప్రయత్నిస్తారు. తుపాకి లేనివారు తూటాలు తెచ్చుకొని ఇంకొకరి తుపాకితో ప్రయత్నిస్తారు. ఎవరు దాన్ని కాల్చగలిగితే ఆ పొట్టేలు వారికే. ఎవరు కాల్చక పోతే అది మంగలి వారికే చెందుతుంది. గతంలో అనగా సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ పార్వేట చాల బారి ఎత్తున జరిదేది. చుట్టు పక్కల చాల పల్లెల నుండి జనం విపరీతంగా వచ్చేవారు. తుపాకి, రైఫిల్ ఉన్న వారు, లేనివారు పిల్లలు, పెద్దలు అందరు వచ్చేవారు. ప్రతి ఏడాది తిరుమలలో జరిగే శ్రీ వేంకటేస్వర స్వామి వారి పార్వేట ఉత్సవానికి ఇది ప్రతిరూపం. ఇటువంటి పార్వేట ఉత్సవాలు ఇంకా కొన్ని ప్రదేశాలలో జరుగుతుండ వచ్చు.
- ============================
No comments:
Post a Comment