Thursday, December 22, 2011

దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?, Worshiping with Light How?



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
  • దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?-సిద్దాంతి డా వి.జి.శర్మ

చాలామంది భక్తులు ఏ దైవారధనకు ఎన్ని వత్తుల దీపాన్ని వెలిగించాలి, ఏ వారం, ఏ సమయంలో దైవారధన చేయాలి అనే విషయాల్లో సందిగ్ధతతో సతమతమవుతుంటారు. వారికోసమే ఈ శీర్షిక... క్రింద చూపబడినట్లుగా దైవారధన చేసి భగవంతుని కృపను పొందండి.


వత్తులు--------వారము-------శుభగడియలు-------జరుపవలసిన పూజ----------పండుగ

ఏక వత్తి--------ఆదివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -రథసప్తమి, దీపావళి
ద్వి వత్తులు ---- సోమవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- శివపార్వతుల పూజ -శివరాత్రి
త్రి వత్తులు----- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు - దత్త పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుష్ఠ వత్తులు- బుధవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -గురుపౌర్ణమి
పంచ వత్తులు-- సోమవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం- దత్తజయంతి
షణ్ముఖ వత్తులు- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- సుబ్రహ్మణ్య పూజ- సుబ్రహ్మణ్య షష్ఠి
సప్త వత్తులు--- శనివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -దీపావళి
అష్ఠ వత్తులు--- ఆదివారం - ఉ 4.30 గం నుండి 6 గం లోపు- వినాయక పూజ - వినాయక చవితి
నవ వత్తులు-- శుక్రవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - దుర్గాదేవి పూజ -నవరాత్రులు
దశ వత్తులు-- బుధవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - రుద్రాభిషేకం -తొలి ఏకాదశి
ఏకాదశ వత్తులు- సోమవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -శివరాత్రి
ద్వాదశ వత్తులు- ఆదివారం - ఉ 6 గం నుండి 7 గం -లోపుసూర్య పూజ -రథసప్తమి
త్రయోదశ వత్తులు- మంగళవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు-సుబ్రహ్మణ్య పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుర్దశ వత్తులు- మంగళవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు -ఆంజనేయ పూజ -హనుమజ్జయంతి




జన్మనక్షత్రం - వెలిగించాల్సిన వత్తులు


నక్షత్రం ----------వత్తులు
అశ్వని ---------నవ వత్తులు
భరణి --------- షణ్ముఖ వత్తులు
కృత్తిక-------- ఏక లేదా ద్వాదశ వత్తులు
రోహిణి------- ద్వి వత్తులు
మృగశిర----- త్రి వత్తులు
ఆరుద్ర------ అష్ఠమ వత్తులు
పునర్వసు-- పంచమ వత్తులు
పుష్యమి---- సప్తమ వత్తులు
ఆశ్లేష------ చతుర్‌ వత్తులు
మఖ------ నవ వత్తులు
పుబ్బ----- షణ్ముఖ వత్తులు
ఉత్తర ----- ఏక లేదా ద్వాదశ వత్తులు
హస్త------ ద్వి వత్తులు
చిత్త ------ త్రి వత్తులు
స్వాతి----- అష్ఠ వత్తులు
విశాఖ----- పంచ వత్తులు
అనూరాధ-- సప్త వత్తులు
జ్వేష్ఠ ------ చతుర్‌ వత్తులు
మూల----- నవ వత్తులు
పూర్వాషాఢ- షణ్ముఖ వత్తులు
ఉత్తరాషాఢ-- ఏక లేదా ద్వాదశ వత్తులు
శ్రవణం----- ద్వి వత్తులు
ధనిష్ఠ------ త్రి వత్తులు
శతభిషం --- అష్ఠ వత్తులు
పూర్వాభాద్ర- పంచ వత్తులు
ఉత్తరాభాద్ర-- సప్త వత్తులు
రేవతి------ చతుర్‌ వత్తులు



పై విధంగా జన్మనక్షత్ర రీత్యా దైవారాధన చేసినట్లయితే... సకల శుభాలు కలిగి సుఖ సౌఖ్యాలు పొందుతారు.

- సిద్దాంతి డా వి.జి.శర్మ,-సెల్‌: 9440944132

  • =============================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.