ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.
వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.
పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.
వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి. అమృతం పంచిన తర్వాత ఇంద్రుని ప్రార్థించి ధన్వంతరి దేవవైద్య పదవి స్వీకరించాడు. కాలక్రమంలో భూమిపై మనుష్యులు అనేక రోగాల పాలయ్యారు. ఇంద్రుని ప్రార్థన మేరకు ధన్వంతరి కాశీరాజైన దివ్‌దాసుగా అవతరించాడు. అప్పుడే ‘్ధన్వంతరి సంహిత’ పేరుతో ఆయుర్వేద మూల గ్రంథం అందించాడు. మనమందరం ఆరోగ్యవంతులుగా ఉండుటకు, కాలుష్య రహిత వాతావరణంలో జీవించుటకు ధన్వంతరి పూజలు చేసి, నాడు చెప్పిన ఆరోగ్య నియమాలను పాటిద్దాం.
For full details - ధన్వంత్రి తెలుగు వికిపిడియాలో
- =============================
No comments:
Post a Comment
Your comment is helpful in improvement of this Blog.