Tuesday, September 20, 2011

గణేష్‌ దీక్షమాలాధారణ,వినాయక మాలాధారణ ,Ganesh Deeksha maalaadhaarana



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండ, వాన లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో , రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు ... పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -గణేష్‌ దీక్షమాలాధారణ,వినాయక మాలాధారణ(,Ganesh Deeksha maalaadhaarana)- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


కార్తీక మాసం వస్తె అయ్యప్ప మాల వేసే భజనలో కనిపించే స్వాములను చూస్తుంటాం . ఇప్పుడు వినాయ మాలధారణ వేయడం మొదలైనది . ఇది ఎప్పటి నుండో ఉన్నపటికీ బహుల ప్రచారము జతగలేదు . సాదారనము ఈ మాల 1121 రోజులు లేదా 41 రోజులు వేసి దీక్షలో ఉంటారు . 41 రోజు మాలను ధరించేభక్తులు వినాయక చవితికి ముందు 21రోజులు , 21రోజు మాల ధరించే భక్తులు వినాయక చవితిరోజున ధరించడం జరుగుతుందన్నారు. 21 & 41 రోజు అనంతరం దీక్షా విరమణ కాణిపాక సిధ్ది వినాయక దేవాలయంలో గావింపబడుతుంది . వినాయక చవితి రోజున గణేష్‌దీక్ష మాలాధారణ చేయడం ఆనవాయితీ అని గణేష్ దీక్ష చేపట్టే భక్తులకు స్వామివారి ఆలయం వద్ద దర్శనానికి కూడా ప్రత్యేక సమయం ఏర్పాట్లు చేయనున్నట్లు కానిపాకం ఆయల పూజారి తెలిపారు. గణేష్‌దీక్ష చేపట్టిన భక్తులందరికి స్వామివారి ఉచిత నిత్య అన్నదానం సత్రంలో భోజన వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.



దేవగణాలకు అధిపతి అయిన వినాయకుని సేవిస్తే సర్వవిఘ్నాలు తొలగిపోతాయని , సత్వరమే కార్యసిద్ధి జరుగుతుందని శ్రీకాకుళం శ్రీ షోడశ గణపతి వ్యవస్థాపల అధ్యక్షులు ' శంకరరావు గురుస్వావి 'చెబుతున్నారు . జిల్లాలో తొలిసారిగా(01-09-2011) శ్రీకాకులం లో వినాయక మాలధారణ చేపట్టి నిష్టతో ఎంతో భక్తిప్రపత్తులతో పూజలు చేస్తున్నారు .

  • *ఐదేళ్ళ(5) నుంచి 70 యేళ్ళ వయసు వరకూ ఎవరైనా ఈ దీక్ష తీసుకొని సంకటవిమోచన గణపతిని పూజించవచ్చును .
  • *మాలధారణ చేసిన భక్తులు రోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఐదు గంటలకల్లా స్నానాధికాలు ముగించుకోవాలి .
  • *వినాయక దేవాలయము చేరి పూజలు , అభిశేకాలు నిర్వహించాలి . యాగ శాలలో చేరి గణేషుని సేవలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలి .9.00 గంటల కల్లా ఎవరివిధులకు వారు వెళ్ళిపోవచ్చును .
  • *మధ్యాహ్నము భిక్ష యదావిధిగా ఉంటుంది .
  • *సాయంత్రము 6.00 గంటలకు గణనాధుని విశేషపూజలు , భజన ఉంటుంది .

ఈవిధముగా దీక్షను 21 రోజులు పాటు చేస్తే కార్యసిద్ధి , అభీష్టసిద్ధి కలగడం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది . విద్యార్ధులకు విద్య , ధనార్ధికి ధనము , మోక్షార్ధికి మోక్షము ... ఇలా ఏ భావముతో పూజిస్తే అది సిద్ధిస్తుంది అని పూజారి తెలిపారు . ఇక్కడ నమ్మకమే ఒక ఔషధము లా పనిసేస్తుంది .గణపతి మంత్రము నిష్టగా జపం చేస్తే అభీష్టాలు సిద్ధిస్తాయని నమ్మకము . గణపతిని స్మరించినా విఘ్నాలు తొలుగుతాయి . స్వామి దీక్ష చేపట్టి 11, 21, 41 దినాలు ఇంట్లో పూహించుకుంటే సర్వాభీష్టాలు నెరవేరుతాయని అంటారు . ఈ మాలధారణ వినాయక చవితి రోజుల్లోనే కాకుండా .. సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఒక శుభమూర్తాన మాల ధరించవచ్చని గురుస్వాములు అంటారు .
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.