Wednesday, December 1, 2010

సిక్కు దేవుళ్ళు - పండగలు , Sikh Gods - Festivals

సిక్కు మతము (Sikhism), గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.

నమ్మకాలు

సిక్కులు విగ్రహారాధన చెయ్యరు. వారు ఏక్ ఓంకార్ (ఏకైక దైవం)ని నమ్ముతారు. సిక్కులు తమ గురువుల్ని దేవుని సందేశహరులుగా భావిస్తారు. సిక్కుల గురువులు తమ మతం హిందూ మతం తరహా మతం అని చెప్పుకున్నారు కానీ సిక్కు మతానికి, హిందూ మతానికి మధ్య చాలా తేడా ఉంది. సిక్కులు స్వర్గ నరకాలని నమ్మరు. స్వర్గ నరకాలు లేకపొతే కర్మ సిధ్ధాంతాలని నమ్మడం కూడా కష్టమే.

సిక్కు పండగలు :
  1. బల్సాఖి (వల్సఖి)-Balsakhi,
  2. దీవాలి -Diwali ,
  3. హల మొహల్లా -Hola Mohalla ,
  4. గురునానక్ జయంతి - Guru Nanak Birth Day ,

List of Sikh Gurus:
# Name--------------Date of birth-----------Guruship on---------Date of ascension--------Age
1 Nanak Dev----------15 April 1469---------20 August 1507------22 September 1539------69
2 Angad Dev----------31 March 1504-------07 September 1539---29 March 1552----------48
3 Amar Das-----------05 May 1479---------26 March 1552--------01 September 1574------95
4 Ram Das------------24 September 1534---01 September 1574---01 September 1581------46
5 Arjan Dev-----------15 April 1563---------01 September 1581---30 May 1606------------43
6 Har Gobind---------19 June 1595---------25 May 1606----------28 February 1644-------48
7 Har Rai-------------16 January 163-------03 March 1644--------06 October 1661---------31
8 Har Krishan--------07 July 1656----------06 October 1661------30 March 1664-----------07
9 Tegh Bahadur------01 April 1621----------20 March 1665-------11 November 1675-------54
10 Gobind Singh------22 December 1666----11 November 1675----07 October 1708---------41
11 Guru Granth Sahib----n/a----------------07 October 1708------n/a---------------------n/a

-(wikipedia.org)


  • =================================
Visit My Website - > Dr.Seshagirirao.com/

No comments: