Thursday, August 26, 2010

ఓనం ,Onam






దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ఓనం అతిపెద్ద పండుగ. ఇది మలయాళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది మరియు మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారములు మరియు సాంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చిక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు మరియు కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు, ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు: మగవారు ఒక చొక్కా మరియు ముండు అని పిలవబడే లంగా వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు మరియు నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ మరియు రవికె ధరిస్తారు. ఓనం కేరళలోని వ్యవసాయ పండుగ.

పూర్తి వివరాలకోసం -> ఓనం పండుగ
  • ========================
Visit My Website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment

Your comment is helpful in improvement of this Blog.